BREAKING
నా పెళ్లిలో షాహిద్ కపూర్‌ను స్టేజ్ పైనుంచి కిందకు నెట్టేసిన కరణ్ జోహార్: కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు షార్ట్ సర్క్యూట్‌తో వాటర్ ప్యూరిఫైయర్ పేలి .. దగ్ధమైన ఇల్లు ఎంపీపీ, జెడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలి రావణాసురుడి పాత్ర కోసం రాకింగ్ స్టార్ యష్ పడ్డ కష్టం: ఏకంగా 33 కేజీల బరువైన దుస్తులు! సీతాదేవి చేతిలో ఖడ్గం పటించడంపై విమర్శలు: సాయి పల్లవికి మద్దతుగా నిలిచిన నటి ఇందిరా కృష్ణన్ అనకాపల్లిలో వైభవంగా అయ్యప్ప పడిపూజ బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' రికార్డుల సునామీ: కేవలం 5 రోజుల్లోనే 660 కోట్లు దాటిన కలెక్షన్లు! డీసీ స్టూడియోస్ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై స్పందించిన జేమ్స్ గన్: కార్పొరేట్ పద్ధతులు నచ్చలేదంటూ వ్యాఖ్యలు అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవాని స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత టీపీసీసీ అధికార ప్రతినిధుల నియామకాలపై స్టే డిఫరెంట్ స్టైల్‌లో సమంత మెటర్నిటీ ఫొటోషూట్: నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్! రామాయణం కవచాల వెనుక అసలు రహస్యం: మూడేళ్లపాటు కష్టపడిన అస్సాం చేతివృత్తి కళాకారులు! సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన మండల యువజన అధ్యక్షుడు..

వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హౌస్ అరెస్ట్

Select Suryaa Now
వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హౌస్ అరెస్ట్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో పాటు అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్‌లను పోలీసులు మంగళవారం ఉదయం హౌస్ అరెస్టు చేశారు.

​కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై నిరసన తెలిపేందుకు వైయస్‌ఆర్‌సీపీ ఈరోజు కళ్యాణదుర్గంలో భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం బయలుదేరుతున్న అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్ రమేష్ గౌడ్‌లను పోలీసులు నివాసాల వద్దే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.

​ర్యాలీకి ముందస్తు అనుమతి లేదనే కారణంతో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నాయకుల హౌస్ అరెస్ట్ వార్త తెలియడంతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని నాయకులు మండిపడ్డారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

రిపోర్టర్  : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్