BREAKING
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత టీపీసీసీ అధికార ప్రతినిధుల నియామకాలపై స్టే డిఫరెంట్ స్టైల్‌లో సమంత మెటర్నిటీ ఫొటోషూట్: నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్! రామాయణం కవచాల వెనుక అసలు రహస్యం: మూడేళ్లపాటు కష్టపడిన అస్సాం చేతివృత్తి కళాకారులు! సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన మండల యువజన అధ్యక్షుడు.. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ చిలీ దర్శకుడు సెబాస్టియన్ లెలియో కన్నుమూత ఆన్‌లైన్ లోన్ యాప్స్ వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్య కుంగ్ ఫూ యోగా షూటింగ్ సమయంలో నన్ను ఏడిపించేంత పని చేసిన ఫరా ఖాన్: నటి అమైరా దస్తూర్ సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ఐకానిక్ టైటిల్: కోలీవుడ్ వర్గాల్లో 'సూర్య 49' హాట్ టాపిక్! వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి: ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ ప్రాజెక్ట్‌లు మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలి – సీపీఐ డిమాండ్ రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్ బాక్సాఫీస్ వద్ద 'సీన్' విధ్వంసం: కేవలం 4 రోజుల్లోనే 150 కోట్లకు చేరువలో సూర్య కొత్త సినిమా! సీతాదేవిని ఫైటర్‌గా చూపిస్తారా: రామాయణం సినిమా మేకర్స్‌పై ముకేష్ ఖన్నా ఘాటు వ్యాఖ్యలు

ఫస్ట్ లవ్’ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను ఆవిష్కరించిన జడ్పిటిసి శైలజా తేజ మూర్తి

Select Suryaa Now
ఫస్ట్ లవ్’ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను ఆవిష్కరించిన జడ్పిటిసి శైలజా తేజ మూర్తి

​పూతలపట్టు (మేజర్ న్యూస్):

పూతలపట్టు మండల కేంద్రంలో ‘నీరుగట్టి రాధా కృష్ణా ప్రెసెంట్స్’ బ్యానర్‌పై రూపొందుతున్న ‘ఫస్ట్ లవ్’ (ఏ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ) షార్ట్ ఫిలిం పోస్టర్‌ను సోమవారం పూతలపట్టు జడ్పిటిసి శైలజా తేజ మూర్తి, రాష్ట్ర టిడిపి నాయకులు యువరాజు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ఆవిష్కరించారు ​ఈ సందర్భంగా జడ్పిటిసి శైలజా తేజ మూర్తి, యువరాజు నాయుడు మాట్లాడుతూ, పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లికి చెందిన యువ దర్శకుడు నీరుగట్టి సాయి కృష్ణ షార్ట్ ఫిలిమ్స్ రంగంలోకి అడుగుపెట్టి తన ప్రతిభను చాటుకోవడం అభినందనీయమన్నారు సాయి కృష్ణ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు ​అనంతరం దర్శకుడు నీరుగట్టి సాయి కృష్ణ మాట్లాడుతూ, ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందించిన ఈ ‘ఫస్ట్ లవ్’ షార్ట్ ఫిలిం షూటింగ్ అంతా పూతలపట్టు మరియు చిత్తూరు పరిసర ప్రాంతాల్లోనే జరిగిందని తెలిపారు నేటి తరం అబ్బాయిలు ఒక అమ్మాయిపై ఉండే ప్రేమే మొదటి ప్రేమ అని భావిస్తుంటారని, కానీ నిజమైన ‘ఫస్ట్ లవ్’ అంటే కుటుంబమే అని గుర్తుచేసే దృఢమైన ఆలోచనతోనే ఈ షార్ట్ ఫిలింను తెరకెక్కించినట్లు వివరించారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని అద్భుతమైన క్వాలిటీ విజువల్స్‌తో ఆస్వాదించేలా దీనిని రూపొందించామని పేర్కొన్నారు ​ఈ షార్ట్ ఫిలింలో భాను తేజ శ్రీత్ హీరోగా, చాముండేశ్వరి హీరోయిన్‌గా నటించగా, నీరుగట్టి సాయి కృష్ణ కథ, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని నీరుగట్టి గణేశ్వరి నిర్మించగా, యోగానంద, కమలాకర్, ఢిల్లీ జయచంద్ర, కొంక రాజశేఖర్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మిస్టర్ జె ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు​ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు గుంటూరు మురళి, చిరంజీవి నాయుడు, పురుషోత్తం రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, యూత్ సభ్యులు పాల్గొని చిత్ర యూనిట్‌ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్