జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్‌కు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ , వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందనలు
జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్‌కు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ , వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందనలు
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 05-11-2026, గురువారం జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన మండవ శ్రీనివాస్ గౌడ్‌కు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి జోగి రమేష్ ని ఇబ్రహీంపట్నంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయవాడలోని మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ విజయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇరువురు నాయకులు మండవ శ్రీనివాస్ గౌడ్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా