చెరువుగట్టు క్షేత్రం సుభిక్షంగా ఉండాలి
నార్కెట్ పల్లి, మేజర్ న్యూస్: కార్తీక మాసం సందర్భంగా మంగళ వారం భక్తులు వేకువ జాము నుంచి చెరువుగట్టు క్షేత్రాన్ని దర్శించుకున్నారు భక్తుల శివ నామ స్మరణలతో ఆలయ క్షేత్రం మారు మోగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులుకలగకుండా ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులకు పంటలు సమృద్ధిగా పండి వారి కుటుంబాలు ఆనందంగా వెళ్లి విరియాలని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు అనంతరంకుటుంబ సమేతంగా సోమవారం సోమవారం శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని ప్రార్థించారు,
అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేముల వీరేశం, కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వరాల రమేష్, ఆలయ ఈవో మోహన్ బాబు, డైరెక్టర్లు సంపత్ కుమార్, సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ నేతకానిక్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాయం శ్యాంసుందర్ రెడ్డి, నార్కట్పల్లి సర్పంచ్ జేరిపోతుల భరత్ గౌడ్,స్థానిక నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు
*