గ్రామాభివృద్ధికి సహకరించాలి...
అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను కోరారు. మంగళవారం ఆమె గ్రామ పెద్దలతో కలిసి గడుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా గ్రావెల్ రోడ్డులను, సిసి రోడ్ల నిర్మాణం, నూతన డ్రైనేజీ నిర్మాణం ఎంత అవసరమని వినతిపత్రంలో పేర్కొన్నారు. వర్షాకాలంలో గ్రావెల్ రోడ్డు లేక డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డుపైకి మురికి నీరు వచ్చి రోగాలు పెరుగుతున్నాయని, వెంటనే నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామంలోని ప్రధాని వీధుల్లో సిసి రోడ్లు వేయించి గ్రావెల్ రోడ్లు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని, గ్రావెల్ రోడ్డు, సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వనమా గాంధీ, సుగ్గల నరసింహారావు, యాదాల వెంకటేశ్వర్లు( వెంకన్న) , లాకావత్ వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు పానుగంటి రాఘవులు, తదితరులు ఉన్నారు.
సూర్య మేజర్ న్యూస్, అన్నపురెడ్డిపల్లి మండల రిపోర్టర్...