స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
సూర్య, సుల్తానాబాద్
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పదో వార్డ్ గాంధీ నగర్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత తన కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల ను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, జిపిఓ మహేందర్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ రమేష్, మాజీ ఎంపీటీసీ పల్లా సురేష్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు గోరే, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.