ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం
పలమనేరు మేజర్ న్యూస్: పలమనేరు మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వావిలి ఆదినారాయణ ఆదేశాలు మేరకు నవంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగిన న్యాయ సేవ వారోత్సవాల సందర్భంగా మంగళవారం పీ.ఎం. గవర్నమెంట్ హై స్కూల్ (బాలుర ), పలమనేరు నందు జాతీయ న్యాయ సేవ దినోత్సవంని ఘనంగా పురస్కరించుకున్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు న్యాయ సేవలను ఉచితంగా ఎలా పొందగలగాలో తెలిపారు. పలమనేరు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.... మోటార్ వెహికల్ యాక్ట్ గురించి పిల్లలకు క్లుప్తంగా తెలిపారు. సీనియర్ న్యాయవాది ఎల్. భాస్కర్ మాట్లాడుతూ... బాల్యవివాహాల గురించి, పోక్సో యాక్ట్ గురించి, మహిళలకు ఉన్న చట్టాల గురించి తెలిపారు.సీనియర్ న్యాయవాది షరీఫ్ మాట్లాడుతూ...పిల్లలకు ఫండమెంటల్ హక్కులు, విధులు గురించి తెలిపారు. తరువాత న్యాయవాదులు, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, పిల్లలు, కోర్టు సిబ్బంది ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఆరిపుల్లా ఖాన్,పీఎం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ షంషీర్, ఉపాధ్యాయులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అనిల్ కుమార్ యాదవ్, పలమనేరు మేజర్ న్యూస్.