andhrapradesh
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్
అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలోని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా పులివెందులలో తనపై నమోదైన పోలీసు కేసును కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల ముగిసిన ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నిరసన తెలిపారనే ఆరోపణలతో జగన్‌పై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేసి, నిలిపివేయాలని పిటిషన్‌లో పేరొన్నారు. జగన్ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు నేడు విచారణ జరపనుంది.