సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన
• గ్రామ సర్పంచ్,ఏనుక శ్రీహరి, ఉపసర్పంచ్ రవీందరుగౌడ్,
• 106 ఓడీలు.. షోకాజ్ నోటీసులిచ్చినా మారని తీరు!
సూర్య, బెజ్జుర్ :
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ఏనుక శ్రీహరి,, ఉపసర్పంచ్,కొండ్ర రవీందర్ గౌడ్,కార్యదర్శి గోలేటి ధర్మయ్య సందర్శించారు. ప్రధానోపాధ్యాయుల విధుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 106 ఓడీలు ఉన్నా, షోకాజ్ నోటీసులు జారీ అయినా నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంఆర్సీలో విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు వచ్చినా పాఠశాలకు తీసుకురావడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.