BREAKING
సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు రెండో త్రైమాసికంలో 7 బిలియన్ డాలర్ల నికర నష్టం జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్‌కు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ , వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందనలు హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు మయన్మార్ సరికొత్త వ్యూహం యునిపర్ 9 నెలల కోర్ ప్రాఫిట్‌లో 60 శాతం వృద్ధి నిరుద్యోగిత గణాంకాల విడుదల వేళ స్థిరంగా దక్షణాఫ్రికా రాండ్ మారకం విలువ ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో స్టార్‌లింక్ లాంచ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన బీటీ గ్రూప్ భారతదేశంలో ఆపిల్ సరఫరా గొలుసుకు వరుస చిక్కులు మూడు నెలల తర్వాత మళ్లీ విదేశీ బాండ్ల వైపు జపాన్ మదుపరులు ఇండోనేషియా ఉపరాష్ట్రపతి భవితవ్యంపై ఉత్కంఠ సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన గుడుంబా, గంజాయికి దూరంగా ఉండాలి – సీఐ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్ ఈనెల 18న కరీంనగర్‌లో లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

గుడుంబా, గంజాయికి దూరంగా ఉండాలి – సీఐ రమేష్

Select Suryaa Now
గుడుంబా, గంజాయికి దూరంగా ఉండాలి – సీఐ రమేష్

 

సూర్య జైనూర్: గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జైనూర్ సీఐ రమేష్, ఎస్సై రవికుమార్ పిలుపునిచ్చారు.

జైనూర్ మండలంలోని పవర్‌గూడ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుడుంబా, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ ఎస్సై రవి కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం, సామాజిక వాతావరణం కూడా దెబ్బతింటాయని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.గుడుంబా, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, పిల్లలు మరియు యువత చెడు అలవాట్లకు గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామంలో ఎక్కడైనా మత్తు పదార్థాల తయారీ, విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత గ్రామాల నిర్మాణానికి పోలీస్ శాఖతో పాటు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పవర్‌గూడ గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.