BREAKING
సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు రెండో త్రైమాసికంలో 7 బిలియన్ డాలర్ల నికర నష్టం జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్‌కు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ , వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందనలు హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు మయన్మార్ సరికొత్త వ్యూహం యునిపర్ 9 నెలల కోర్ ప్రాఫిట్‌లో 60 శాతం వృద్ధి నిరుద్యోగిత గణాంకాల విడుదల వేళ స్థిరంగా దక్షణాఫ్రికా రాండ్ మారకం విలువ ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో స్టార్‌లింక్ లాంచ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన బీటీ గ్రూప్ భారతదేశంలో ఆపిల్ సరఫరా గొలుసుకు వరుస చిక్కులు మూడు నెలల తర్వాత మళ్లీ విదేశీ బాండ్ల వైపు జపాన్ మదుపరులు ఇండోనేషియా ఉపరాష్ట్రపతి భవితవ్యంపై ఉత్కంఠ సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన గుడుంబా, గంజాయికి దూరంగా ఉండాలి – సీఐ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్ ఈనెల 18న కరీంనగర్‌లో లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ఈనెల 18న కరీంనగర్‌లో లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Select Suryaa Now
ఈనెల 18న కరీంనగర్‌లో లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర...  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

 సూర్య కరీంనగర్ ప్రతినిధి :ఈనెల 18న కరీంనగర్‌లో లక్ష మందితో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరుకానున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.‘ఎస్ఐఆర్‌’ (SIR) పేరిట ఎన్నికల సంఘం, రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. నితిన్ నబిన్ తొలిసారిగా కరీంనగర్‌కు వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు మారుమోగేలా కనీవినీ ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.గాంధీ సర్కిల్, వైశ్య భవన్ నుంచి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ యాత్రలో నితిన్ నబిన్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొననున్నారు.ఈ నేపథ్యంలో మహా పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. జన సమీకరణ, పాదయాత్ర నిర్వహణ, ప్రచార కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఇండీ కూటమి పేరుతో విపక్షాలు ఎస్ఐఆర్‌పై అసత్య ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్‌కు వస్తున్నారని తెలిపారు.మహా పాదయాత్రకు కనీసం లక్ష మంది హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి శక్తి కేంద్రాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలను సమీకరించాలని పార్టీ నాయకులకు సూచించారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించి పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, గంగాడి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు కోమాల అంజనేయులు, నల్లాల ఓదేలు, మోహన్ రెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు, గుజ్జ శ్రీను, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కోహెడ వెంకన్న, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.