BREAKING
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు మయన్మార్ సరికొత్త వ్యూహం యునిపర్ 9 నెలల కోర్ ప్రాఫిట్‌లో 60 శాతం వృద్ధి నిరుద్యోగిత గణాంకాల విడుదల వేళ స్థిరంగా దక్షణాఫ్రికా రాండ్ మారకం విలువ ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో స్టార్‌లింక్ లాంచ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన బీటీ గ్రూప్ భారతదేశంలో ఆపిల్ సరఫరా గొలుసుకు వరుస చిక్కులు మూడు నెలల తర్వాత మళ్లీ విదేశీ బాండ్ల వైపు జపాన్ మదుపరులు ఇండోనేషియా ఉపరాష్ట్రపతి భవితవ్యంపై ఉత్కంఠ సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన గుడుంబా, గంజాయికి దూరంగా ఉండాలి – సీఐ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్ ఈనెల 18న కరీంనగర్‌లో లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రూ.4,708 కోట్లతో భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం శివదీక్షతో ఆధ్యాత్మిక శోభ.. నకిరేకల్ రామలింగేశ్వరాలయంలో భక్తుల సందడి కార్తీకమాసం తొలిరోజే 100 మందికి పైగా శివమాల ధారణ.. 30 మంది కన్నె స్వాములు 88 రోజులుగా పార్లమెంట్ ప్రొరోగ్ కాలేదు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

శివదీక్షతో ఆధ్యాత్మిక శోభ.. నకిరేకల్ రామలింగేశ్వరాలయంలో భక్తుల సందడి కార్తీకమాసం తొలిరోజే 100 మందికి పైగా శివమాల ధారణ.. 30 మంది కన్నె స్వాములు

Select Suryaa Now
శివదీక్షతో ఆధ్యాత్మిక శోభ..   నకిరేకల్ రామలింగేశ్వరాలయంలో భక్తుల సందడి కార్తీకమాసం తొలిరోజే 100 మందికి పైగా శివమాల ధారణ.. 30 మంది కన్నె స్వాములు

నకిరేకల్, మేజర్ న్యూస్:కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తిభావం వెల్లివిరిసింది. మాసం మొదటి రోజునే 100 మందికి పైగా భక్తులు శివదీక్ష స్వీకరించి మాలధారణ చేశారు. ఈ ఏడాది ప్రత్యేకంగా సుమారు 30 మంది కన్నె స్వాములు తొలిసారిగా శివమాల ధరించడం విశేషం.

ఆలయ ప్రధాన అర్చకులు జిగురు లక్ష్మీనరసింహం ఆధ్వర్యంలో స్వాములకు శాస్త్రోక్తంగా మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గురుస్వామి కట్టకూరి వెంకన్న గౌడ్ నూతన కన్నె స్వాములకు శివదీక్ష నియమాలు, పూజా విధానాలను వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల రమేష్, ధర్మకర్తలు స్వాములకు పూజా విధానం పుస్తకాలను పంపిణీ చేశారు.

ఇళ్లలో పూజలు చేసుకునేందుకు సౌకర్యం లేని స్వాములు ఆలయ మండపంలోనే ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించుకునేలా కమిటీ సహకరిస్తుందని తెలిపారు. అలాగే దీక్ష చేపట్టిన శివస్వాములకు 41 రోజులపాటు ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ ఉప్పల రమేష్, ధర్మకర్తలు వెల్లడించారు..