BREAKING
బ్రిటన్ మార్కెట్లలో బోవాజ్ వీన్‌స్టెయిన్ వ్యూహం.. ఆక్టివిస్ట్ పెట్టుబడులపై కొత్త చర్చ టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

టిడిపి అభ్యర్థిని గెలిపించుకోండి

Select Suryaa Now
టిడిపి అభ్యర్థిని గెలిపించుకోండి

 

మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోండి..
రాష్ట్ర జిసిసి చైర్మన్ శ్రావణ్ కుమార్..


డుంబ్రిగుడ, నవంబర్ 28, మేజర్ న్యూస్ :-

తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోండి మీ గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోండని ఆంధ్రప్రదేశ్ జీసీసీ చైర్మన్ కిడారి. శ్రావణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రం కె పనసపొట్టు మోడల్ కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ మన్య ప్రాంతంలో అభివృద్ధి  చెందుతుందంటే కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పారు. ప్రతి మారుమూల గ్రామంలో అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారిలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ప్రజల అష్ట కష్టాలను చూసి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు ప్రధానంగా ప్రధాన రహదారులు నిర్మించిందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోపక్క రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నారనిచెప్పారు. మరింత అనేక సంక్షేమ ఫలాలు అందుకోవాలంటే తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత మీపై ఎంతో ఉందని చెప్పారు. ప్రధానంగా మండల కేంద్రం పోతంగి పంచాయితీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని కమ్మిడి. రంబను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని గిరిజనులకు ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు, పోతంగి పంచాయితీ ఎంపీటీసీ దన్నే రావు, సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ భాస్కరరావు, పోతంగి పంచాయితీ అధ్యక్షుడు భీమరాజు,టిడిపి మండల నాయకులు సింహాచలం, సింహాద్రి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.