తక్కువ ధరకే ధరణి బియ్యం విక్రయాలు...
నరసన్నపేట, నవంబర్ 28 మేజర్ న్యూస్: ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధరణి బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా నరసన్నపేట మండలంలో శనివారం నుంచి ధరణి బియ్యం విక్రయాలు అందుబాటులోకి వచ్చాయి.
26 కిలోల బీపీటీ (బీపీటీ ) ధరణి బియ్యం బస్తా ధరను రూ.1,274గా ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలో ఎస్‌వీఎల్ రైస్ మిల్లు సమీపంలో, హీరో హోండా షోరూం పక్కన ఒక విక్రయ కేంద్రంతో పాటు, శ్రీ శాంతమణి రైస్ మిల్లు వద్ద మరో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ రాయితీ ధరల బియ్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు.