తాను మరణించి మరో ఇద్దరికి నేత్రదానం -- సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల ఆలోచన ఆదర్శనీయం
కామవరపుకోట, మేజర్ న్యూస్ :మండలంలోని తడికలపూడి గ్రామానికి చెందిన షిరిడి హోటల్ అధినేత కలవల సుబ్బారెడ్డి శనివారం మృతి చెందారు. సుబ్బారెడ్డి మృతి చెందినప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఉదార స్వభావంతో సుబ్బారెడ్డి నేత్రాలను దానం చేశారు. విజయవాడ ఎల్.వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు తడికలపూడి వచ్చి సుబ్బారెడ్డి నేత్రాలను సేకరించి తీసుకువెళ్లారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉండి కూడా మరో నలుగురికి కంటిచూపు ఇవ్వాలనే ఆలోచనతో నేత్రాలను ఇవ్వటంతో ఆదర్శంగా నిలిచారని గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులను అభినందించారు. సుబ్బారెడ్డి హోటల్ యజమానిగా గ్రామంలో అందరితో కలుపుకోలుగా ఉండేవాడని స్నేహపూర్వకంగా మాట్లాడేవాడని తన మరణం పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.