BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

స్వచ్ఛ నర్సీపట్నం’ లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి అడుగులు

Select Suryaa Now
స్వచ్ఛ నర్సీపట్నం’ లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి అడుగులు

 

- ​పారిశుద్ధ్యంపై అధికారులతో సమీక్ష.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
నర్సీపట్నం నవంబర్ 28 మేజర్ న్యూస్:
​నర్సీపట్నం మున్సిపాలిటీని ‘స్వచ్ఛ నర్సీపట్నం’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆమె, ఏ సమస్య వచ్చినా చిన్నదిగా భావించకుండా తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి అధికారుల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
​ఈ క్రమంలో పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చైర్‌పర్సన్ నడుం బిగించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిట్టిబాబు, సచివాలయ శానిటరీ సెక్రటరీలు మరియు శానిటరీ మేస్త్రీలతో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డుల్లో చెత్త సేకరణకు ఆటంకాలు ఎందుకు ఏర్పడుతున్నాయని, అందుకు గల ప్రధాన కారణాలను సిబ్బందిని అడిగి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.
​ప్రతి సచివాలయ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, అందుబాటులో ఉన్న పుష్‌కార్ట్‌లు, ట్రాక్టర్లు మరియు డ్రైవర్ల వివరాలపై ఆమె ఆరా తీశారు. ప్రధానంగా సిబ్బంది కొరతను ఏ విధంగా భర్తీ చేయాలనే అంశంపై దృష్టి సారించారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు, బ్లీచింగ్ నిల్వలు, దోమల నివారణకు వాడే స్ప్రేయర్లు, ఫాగింగ్ లిక్విడ్ వంటి సామగ్రి లభ్యతపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. అనంతరం శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
​పారిశుద్ధ్యం విషయంలో పట్టణ ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకూడదని చైర్‌పర్సన్ పద్మావతి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. త్వరలోనే అన్ని సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు (సడన్ విజిట్) నిర్వహిస్తానని, ఆ సమయంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆమె హెచ్చరించారు.