స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు - ముగిసిన పరిశీలన
గూడూరు, మేజర్‌న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంపిటిసిలు, జడ్‌పిటిసి స్థానలకు నామినేషన్ల అంకం ముగిసింది. శనివారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. గూడూరు మండలంలో ఎనిమిది స్థానాలకు పరిశీలన అనంతరం 40 మంది అభ్యర్ధులు 46 నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రకటించారు. చిల్లకూరు మండలంలో 13 స్థానలకు మూడు చోట్ల పరిశీలన అనంతరం మూడు చోట్ల ఒక్కో నామినేషన్ దాఖలు కాగ మిగిలిన పది స్థానాల్లో 54 నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు. కోట మండలంలో 16 స్థానాలకు 67 నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించారు. వాకాడు మండలంలో 11 స్థానాలకు 50 నామినేషన్లు, చిట్టమూరు మండలంలో 12 స్థానలకు 75 నామినేషన్లు పరిశీలన అనంతరం మిగిలినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల పరిశీలన ముగియడంతో అభ్యంతరాలపై విచారణ అనంతరం నామినేషన్ల వెనక్కు తీసుకున్న తర్వాత ఈనెల 27న తుది జాబితాలు ప్రకటించనున్నారు. ఇదే సమయంలో నామినేషన్ల పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారులు గూడూరులోని ఎస్‌వి ఆర్ట్స్ కళశాలలో బ్యాలెట్ పెట్టెలు భధ్రపరిచే స్ట్రాంగ్ రూంలతోపాటు ఓట్ల లెక్కింపు ప్రాంతాలను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులతోపాటు, ఎంపిడిఓలు, ఎఓలు సిబ్బంది ఉన్నారు.