స్థానిక సంస్థలు ఎన్నికలకు సర్వం సిద్ధం
కోటబొమ్మాళి, సూర్య : కోటబొమ్మాళి మండలంలో గురువారం జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడిన ఆయన, మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 78 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 47,950 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు.
ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగేందుకు మొత్తం ప్రాంతాన్ని 10 రూట్లుగా, 5 జోన్లుగా విభజించినట్లు ఆర్వో వెల్లడించారు. ఈ పోలింగ్ ప్రక్రియలో 87 మంది ప్రిసైడింగ్ అధికారులు, 87 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మరో 343 మంది ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 608 మంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. సిబ్బంది అందరూ తమకు కేటాయించిన బ్యాలెట్ బాక్సులు, అవసరమైన ఎన్నికల సామగ్రితో సంబంధిత పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారని తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కిల్లారి నారాయణరావు, తహసీల్దార్ చింతలపూడి ప్రసాదరావు తదితర అధికారులు పాల్గొన్నారు.