సొంత నిధులతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తాం
- ఇరిగినేని నగర్‌లో తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ
- సర్పంచ్ మానం రాజేశ్వరి దంపతులకు ఘన సన్మానం
పామూరు, మేజర్ న్యూస్ : ప్రజలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా ఇరిగినేని నగర్‌లో వచ్చే నెలలో సొంత నిధులతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ మానం రాజేశ్వరి, ఆమె భర్త మానం మల్లికార్జున యాదవ్ తెలిపారు. కాలనీవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
శనివారం ఇరిగినేని నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మానం రాజేశ్వరి దంపతులతో పాటు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్‌ను కాలనీవాసులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ బైరెడ్డి జాహ్నవి రెడ్డి సహకారంతో పాటు పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో దండే వెంకటేశ్వర్లు, దేవరకొండ చెన్నకేశవులు, పోతయ్య, అంకయ్య, బాలయ్య, ఈర్ల రాజు, బండారు వెంగళరావు, రమేష్, కొండలరావు, వెంకటేష్, సవరం అంకయ్య, లక్ష్మయ్య, దండే తిరుపతయ్య, సమరం వెంగళరావు, సుబ్బమ్మ, వెంగమ్మ, ఆదిలక్షమ్మ, గడిపూటి బేబమ్మ, వెంకట సుబ్బమ్మ, కోటపాటి హైమావతి, దేవరకొండ చిన్న కృష్ణయ్య, ఈర్ల చిరయ్య తదితరులు పాల్గొన్నారు.