స్క్రాబుల్ టోర్నమెంట్‌లో పెనుగొండ భాష్యం విద్యార్థికి ద్వితీయ స్థానం
వాసవి పెనుగొండ, సూర్య న్యూస్: గుంటూరులోని గోరంట్ల మహతి భాష్యం క్యాంపస్‌లో భాష్యం విద్యాసంస్థలు నిర్వహించిన సెంట్రల్ స్క్రాబుల్ టోర్నమెంట్ 2026–27లో పెనుగొండ భాష్యం పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కొవ్వూరి శ్రీ సాయి కళ్యాణ్ ఆదిరెడ్డి ద్వితీయ స్థానం సాధించాడు. ఈ విజయంతో పాఠశాలకు, పెనుగొండ గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.విద్యార్థుల్లో ఆంగ్ల పదజాల పరిజ్ఞానం, ఆలోచనా నైపుణ్యాలు, ఏకాగ్రత, పోటీతత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. భాష్యం విద్యాసంస్థలకు చెందిన వివిధ పాఠశాలల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, వివిధ దశల్లో ప్రతిభ కనబరిచిన 23 జోన్లకు చెందిన 128 మంది విద్యార్థులు సెంట్రల్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది విజేతలుగా నిలిచారు.ఈ పోటీల్లో కళ్యాణ్ మొత్తం ఐదు రౌండ్లలో నాలుగు రౌండ్లలో విజయం సాధించి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పెనుగొండ గ్రామానికి చెందిన కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, పార్వతి దంపతుల కుమారుడైన కళ్యాణ్ సాధించిన విజయంపై పాఠశాల ప్రిన్సిపల్ ఎన్.వి. అప్పారావు హర్షం వ్యక్తం చేశారు.ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు పదజాల పరిజ్ఞానం, ఏకాగ్రత, వేగంగా ఆలోచించే సామర్థ్యం, నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. చదువుతోపాటు విజ్ఞానదాయకమైన పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవడం అభినందనీయమన్నారు.విజయం సాధించిన కళ్యాణ్‌ను భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, భాష్యం సాకేత్ రామ్, వెస్ట్ జోన్ ఇన్‌చార్జి ఏ. శ్రీమన్నారాయణ రెడ్డి, చాంప్స్ ఇన్‌చార్జి శ్రీమతి రాణి రోజాజీతో పాటు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్: పి. వెంకట్రామయ్య , పెనుగొండ , పశ్చిమ గోదావరి జిల్లా