సింగరకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం.
సూర్య న్యూస్ అద్దంకి.:అద్దంకి మండలం సింగరకొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణం లో ఐదుగురు దంపతులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్న వీరికి స్వామివారి శేష వస్త్రము తీర్థప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో మద్దినేని శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, సభ్యులు ఉన్నారు.