శ్రీకాళహస్తి పట్టణం పురపాలకసంఘం నోటిఫికేషన్ నెంబర్
865. ఎస్ ఇ సి ఎఫ్ 2/2026, 17-10-2026 ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విజయవాడ ఉత్తర్వులు ప్రకారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 44 వార్డులకు సంబంధించిన వార్డులు వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను ఫారం-1లో 24-10-2026 తేదీన ప్రచురించడం జరిగింది అని పురపాలక సంఘం కమిషనర్ కె.వి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఓటర్ల జాబితాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం 44 వార్డులు ఓటర్లు పరిశీలించేందుకు శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయం, తహశీల్దారు కార్యాలయం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, శ్రీకాళహస్తి, స్వర్ణ, గ్రామ సచివాలయములలో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఓటర్లు పరిశీలన చేసుకోవాలని కోరారు.
వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి 9644411197