శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవం
శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేంచేసియున్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా స్వామి, అమ్మవార్ల ప్రకారోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక వాతావరణం నడుమ నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాస ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో పులకించాయి. భక్తుల శివనామస్మరణ, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ కారోత్సవం కనులపండువగా సాగింది. ఉత్సవానికి విచ్చేసిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.