BREAKING
ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్ వినతి ఇల్లందులపాడులో 18న బతుకమ్మ పోటీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు పంటలు ఎండుతున్నా పట్టించుకునేదెవరు? మంత్రి జూపల్లిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు

శివాలయంలో వైభవంగా కుంకుమ పూజలు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన విశాలాక్షి అమ్మవారు

Select Suryaa Now
శివాలయంలో వైభవంగా కుంకుమ పూజలు  శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన విశాలాక్షి అమ్మవారు

టి. నరసాపురం, సూర్య న్యూస్  అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శివాలయంలో కొలువుదీరిన విశాలాక్షి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవీంద్ర శర్మ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధన, ధాన్య, ఐశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మీ అమ్మవారిని ఈ పవిత్రమైన నవరాత్రి వేళ దర్శించుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.

 సూర్య క్రైమ్ రిపోర్టర్: అద్దంకి గిరి కుమార్ ఏలూరు జిల్లా