రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి
మంత్రి పొంగులేటి ఆశయాలకు అనుగుణంగా సుందరీకరణ పనులు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన చైర్పర్సన్ అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఎదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అభివృద్ధి, సుందరీకరణ పనులకు అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకత్వంలో పట్టణానికి కొత్త రూపు తీసుకురావడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా నాయుడుపేట సర్కిల్, కోదాడ ఎక్స్‌రోడ్, వెంకటగిరి ఎక్స్‌రోడ్ వద్ద చేపడుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఏఈ అప్పారావు, స్థానిక కౌన్సిలర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్ది, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా సాగుతూ ప్రజలకు ఉపయోగపడేలా చూడటంపై అధికారులు దృష్టి సారించారు. మంత్రి పొంగులేటి ఆశయాలకు అనుగుణంగా ఎదులాపురాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు 5వ వార్డు కౌన్సిలర్ బానోత్ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు.. పట్టణానికి సరికొత్త రూపం.. ఎదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం!