BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....!

Select Suryaa Now
ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....!

​కావలి మేజర్ న్యూస్ :   వైద్యో నారాయణో హరిః" అన్నారు పెద్దలు. కానీ, ఆ సూక్తిని కేవలం మాటలకే పరిమితం చేయకుండా తన నిత్య జీవితంలో, వృత్తిలో నిరూపిస్తూ కావలి ప్రాంత ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచి కంటి రామస్వామి  వృత్తిరీత్యా వైద్యుడైనా... ప్రవృత్తిరీత్యా అపర కర్ణుడిలా పేద సాధలకు, విద్యార్థులకు అండగా నిలుస్తూ ‘మంచి మనసున్న మహారాజు’గా కావలి ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు.
​చదువుకు ఆసరా.. వైద్యంలో దాతృత్వం: ​ఆపదలో ఉండి తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయం అందించడం డాక్టర్ మంచి కంటి రామస్వామి  నైజం. ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎందరో పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. అలాగే, వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, అవసరమైన వారికి మందులు, ఆర్థిక సహాయం అందిస్తూ ఆపద్బాంధవుడిగా నిలిచారు.
​మున్సిపల్ చైర్మన్ స్థానానికి పూర్తి అర్హుడు:  ​పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దూరదృష్టి కలిగిన డాక్టర్ మంచి కంటి రామస్వామి  కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలబడితే అన్ని విధాలా అర్హులని స్థానిక ప్రజలు, మేధావులు బలంగా విశ్వసిస్తున్నారు.  ​ రాజకీయ పదవుల కోసం కాకుండా, కేవలం ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావమే ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. పట్టణంలోని తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల అభివృద్ధి వంటి ప్రజా సమస్యలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. వివాదరహితుడిగా, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా పట్టణ ప్రజలందరి ఆమోదం పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ​పట్టణ సమగ్ర వికాసానికి, పేదజనుల సంక్షేమానికి ఇటువంటి మచ్చలేని, సేవానిరతి కలిగిన వ్యక్తి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే కావలి మున్సిపాలిటీ మోడల్ పట్టణంగా మారుతుందని కావలి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.