సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్
సిద్దిపేట అర్బన్ :సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సెల్ చైర్మన్ ఇర్ఫాన్ అలీ, సిద్దిపేట జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు రషద్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ చేతుల మీదుగా నూతన అధ్యక్షుడు ఎండీ అతిఫ్కు నియామక ఉత్తర్వుల ప్రతిని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు రషద్ అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఎండీ అతిఫ్కు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, డీసీసీ ఉపాధ్యక్షుడు చాంద్ పాషా, షాబుద్దీన్, వాహబ్, అజ్మత్, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్, పాత కోటి రమేష్, దస్తగిరి, షన్నా, అన్సార్, ఆసిఫ్, ఫిరోజ్, ఫారూఖ్, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.