BREAKING
నెల్లూరు మేయర్ గా విజయన్నను ఆశీర్వదించండి - కాకాణి" కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కంచర్ల వెంకట్‌రెడ్డి నెహ్రూ నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు దసరా వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఇజ్జత్‌నగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు గొడ్డలి దెబ్బలను అడ్డుకున్నానని వెల్లడించిన కెప్టెన్ సైబర్‌ భద్రతపై ‘దాండియా’ అవగాహన.... సాంస్కృతిక వేడుకల్లో సైబర్‌ నేరాలపై చైతన్యం మాదాపూర్‌లో యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలో అగ్నిప్రమాదం భారత క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు శేరిలింగంపల్లిలో ఘనంగా దేవీ శరన్నవరాత్రులు: పార్బణ్ సమితి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ! కౌన్సిలర్ అభ్యర్థిగా తులసి దుర్గాప్రసాద్ నామినేషన్ ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యం ఖూనీ.. ఇది చీకటి రోజు! ఆసియా పారా గేమ్స్ 2026కు ఘన స్వాగతం పలికిన జపాన్ ప్రధాని సనే తకైచి గుడ్డికాయలంకలో పౌరాణిక పద్య నాటక మహోత్సవాలు ప్రారంభం* బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న నీలంమధు దంపతులు

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి

Select Suryaa Now
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి
వికారాబాద్,(సూర్య): జిల్లాలో 2026–27 వానాకాలం వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటలను సులభంగా విక్రయించుకునేలా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం, శిక్షణ కార్యక్రమంలో ఆయన సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం మొత్తం 140 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఇందులో దొడ్డు రకం ధాన్యానికి 118 కేంద్రాలు, సన్న రకం ధాన్యానికి 22 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రెండు లారీలు, పది మంది హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం గుర్తించిన సన్న ధాన్యం రకాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించనున్నట్లు తెలిపారు. ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, తెలంగాణ సోనా, కేఎన్‌ఎం 1638, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం 7715, బీపీటీ 5204 సాంబా మసూరి, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్‌ 44 సిద్ధు తదితర రకాల గుర్తింపు, కొనుగోళ్ల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సన్న ధాన్యం రకాలను గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నారు. రాబోయే ఎల్‌నినో ప్రభావం, ఎండలు, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీసీఓ, డీఆర్డీఓ, డీసీఎంఎస్‌ సంస్థల సమన్వయంతో టార్పాలిన్లు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు సుమారు 45 రోజులపాటు కొనసాగనున్న నేపథ్యంలో ధాన్యం నిల్వకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక్కో కేంద్రానికి 20 టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్న టార్పాలిన్లను అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఇదిలా ఉండగా, జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి వెల్లడించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ నుంచి అధికారిక ఆదేశాలు అందినట్లు తెలిపారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా ఉంటుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో పరిగిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, రాకంచెర్ల కాటన్ మిల్స్, నరసింహ కాటన్ మిల్స్; తాండూరులో ఎమ్మెస్ శుభం ఇండస్ట్రీస్, ఎమ్మెస్ మారుతి ఇండస్ట్రీస్, బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్; వికారాబాద్‌లో ఎమ్మెస్ ధరణి కాటన్ మిల్స్, ఎమ్మెస్ సాయిబాబా అగ్రోటెక్, ఎమ్మెస్ అయ్యప్ప కాటన్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొడంగల్‌లో ఎమ్మెస్ విజయ ఇండస్ట్రీస్, కోట్‌పల్లిలో ఎమ్మెస్ సుమిత్ర కాటన్ మిల్, సాయిబాబా కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్, దారూరులో ఎమ్మెస్ శ్రీ సాయిబాబా అగ్ర కమోడిటీస్, మర్పల్లిలో ఎమ్మెస్ అయ్యప్ప కాటన్ ఇండస్ట్రీస్ వద్ద కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించి, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి కవిత, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, డీఎం సివిల్ సప్లై నరసింహ, డీటీ సివిల్ సప్లై గణపతి, డీసీఎంఎస్‌ శ్యాంసుందర్, మార్కెటింగ్ శాఖకు చెందిన స్వరన్ సింగ్, డీసీఓ కె. నాగరాజన్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.