BREAKING
నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన! వేదపాఠశాలలో వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, శ్రీమంతుని.. వేదపండితుల వేదాశీర్వచనం! వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నెహ్రూ నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
 నెహ్రూ నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

కొండాపూర్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అపార్ట్ మెంట్లలోని మహిళలు, చిన్నారులు గంటల తరబడి బతుకమ్మ, కోలాట ఆడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా పట్నంలోనూ గునుగు, తంగేడు, తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను తయారు చేసి పల్లెలకు దీటుగా  భక్తి ని చాటారు.

 నెహ్రూ నగర్ లోని శ్రీ రేణుకా అపార్ట్ మెంట్ లో దుర్గామాత చిత్రపటంతో గునుగు పూలు, బంతిపూలతో పెద్ద బతుకమ్మను తయారు చేసి భక్తి పారవశ్యం చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ యువజన నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, దేవులపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి ని పూజించే తెలంగాణ ఆడపడుచుల పండగ బతుకమ్మ పండగ అన్నారు. ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే గొప్ప సంస్కృతి మనకు దక్కడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందన్నారు. 

మారుతున్న‌ కాలానికి‌ అనుగుణంగా బతుకమ్మ పండగ అంతరించిపోకుండా రాబోయే తరాలకు సైతం ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా‌ ఉందన్నారు‌‌. చిన్నారులు ఉత్సాహంగా కోలాటలు ఆడి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మకు మహిళలు పూజలు చేసి గోపీనగర్ బతుకమ్మ‌కుంటలో నిమజ్జనం చేశారు.