దసరా వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
చందానగర్,మేజర్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్, గోపినగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులతో కలిసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.