BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

మాదాపూర్‌లో యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలో అగ్నిప్రమాదం

Select Suryaa Now
మాదాపూర్‌లో యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలో అగ్నిప్రమాదం

మాదాపూర్,మేజర్ న్యూస్ :  మాదాపూర్‌ ఖానామెట్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌ కన్వెన్షన్‌ సమీపంలోని యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తుమ్మిడికుంట వెనుక భాగంలో ఉన్న సంస్థలో మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మాదాపూర్‌, కూకట్‌పల్లి అగ్నిమాపక కేంద్రాల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ప్రస్తుతం పొగ వెలువడుతుండటంతో సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ రక్షణ రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్‌, రాడార్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సాంకేతిక ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. డ్రోన్లను గుర్తించి అడ్డుకునే వ్యవస్థల తయారీ, సరఫరాతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.