నెల్లూరు మేయర్ గా విజయన్నను ఆశీర్వదించండి - కాకాణి"
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆదివారం శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , మేరీగ మురళీధర్ , మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్ రెడ్డి , పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ , మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తో కలిసి మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్కుమార్రెడ్డి కి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, జగన్ నాయకత్వంపై నెల్లూరు నగర ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, మేయర్ అభ్యర్థి ఎంపికలోనే టీడీపీ ఓటమిని అంగీకరించిందని వైసిపి నాయకులు అన్నారు.ఆనం విజయ్కుమార్రెడ్డి ని నెల్లూరు నగర ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. నెల్లూరు నగరానికి సమర్థవంతమైన మేయర్ అవసరం అని,మేయర్ స్థానంతో పాటు 72 మంది కార్పొరేటర్లను గెలిపించి వైఎస్సార్సీపీకి విజయం అందించాలని ఉన్నారు. వైఎస్ఆర్సిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అలాగే 72 మంది కార్పొరేటర్ లను గెలిపించాలని అన్నారు.