బోగోలు మండలంలో వైసీపీకి గట్టి షాక్.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలోకి భారీ వలసలు...!
కావలి,ఆదివారం:18 బోగోలు మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి గుడ్‌బై చెప్పి, అధికార తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.బోగోలు మండలం కప్పరాలతిప్ప మేజర్ పంచాయతీకి చెందిన సుమారు 30 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరాయి.కప్పరాలతిప్ప పంచాయతీకి చెందిన చల్లా క్రాంతి, బాణాల ఎజగేల్, పంది పార్టీ మనోహర్, ఆకుల డేవిడ్ పాల్ ఆధ్వర్యంలో వారి అనుచరులు మరియు సుమారు 30 కుటుంబాల వారు వైసీపీని వీడి కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో వీరంతా అధికారికంగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయత్వంపై నమ్మకంతోనే మరిన్ని కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి లేల్లపల్లి సుధీర్ కుమార్ జిల్లా కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర్ల రెడ్డి,సోమశిల మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు గారు, బోగోలు పిఎసిఎస్ ప్రెసిడెంట్ చిలకపాటి వెంకటేశ్వర్లు, మనోహర్, క్రాంతి, యెహెఙ్కేల్,గోచిపాతల సంజయ్, అద్భుత రాజ్, ఆకుల డేవిడ్ పాల్ వెంకటస్వామి, పుచ్చకాయల రమేష్, ఎస్ ఎస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..