BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న నీలంమధు దంపతులు

Select Suryaa Now
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న నీలంమధు దంపతులు

 పటాన్ చెరు;తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ లోని ఆయన నివాసంలో తన సతీమణి నీలం కవిత సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏర్పాటు చేసిన బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పూజించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమంతా గ్రామ గ్రామాన అక్క చెల్లెలు సంబరంగా నిర్వహించుకునే పూల పండగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పాటలతో ఆటలతో తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే సామాజిక సంబురం ఈ పండగ అని కొనియాడారు. పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి, సాంప్రదాయం మన తెలంగాణకే దక్కిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందనీ స్పష్టం చేశారు. మహిళలందరూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని కోరారు. ఆ గౌరీ మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిరవిల్లాలని ఆకాంక్షించారు..