ఒంటరి మహిళకు నిత్యావసర సరుకుల పంపిణీ..
అనంతపురం విద్య మేజర్ న్యూస్ :- నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం చైర్పర్సన్ డాక్టర్ ఎస్. నిర్మలమురళి ఆధ్వర్యంలో నగర శివారులోని అనారోగ్యంతో బాధపడుతున్న ఒంటరి మహిళకు రెండు నెలలకు సరిపడా 42 రకాల నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు.
ట్రస్ట్ సభ్యుడు శ్రీనివాసులు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించినట్లు నిర్మలమురళి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒంటరి మహిళలకు ఇరుగుపొరుగు వారు అండగా నిలవాలని, వారిని మాటలతో వేధించకుండా ఆపదలో ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భారతి, శ్రీనివాసులు, శకుంతల, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.