అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్య సమాచారం ఈ నెల 21 నుంచి బాండ్ల పరిశీలన.. మండలాల వారీగా తేదీలు ఖరారు
తాడిమర్రి సూర్య రిపోర్టర్ బండారు వేంకటేశు :- అనంతపురం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల పరిశీలనకు సంబంధించి అధికారులు కీలక సమాచారం వెల్లడించారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలోని షాదీఖానాలో మండలాల వారీగా బాండ్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు వివిధ మండలాలకు సంబంధించిన బాండ్లను పరిశీలించనున్నారు. బాధితులు తమకు కేటాయించిన తేదీల్లో అవసరమైన పత్రాలతో హాజరుకావాలని ఎస్ఐ కృష్ణవేణి సూచించారు. మండలాల వారీగా బాండ్ల పరిశీలన తేదీలు , అక్టోబర్ 19, సోమవారం: శెట్టూరు మండలానికి సంబంధించిన పరిశీలన రద్దు చేశారు. ఆ రోజు సెలవు. , అక్టోబర్ 20, మంగళవారం: సెలవు. అక్టోబర్ 21, బుధవారం: తాడిమర్రి మండలం. అక్టోబర్ 22, గురువారం: నల్లచెరువు మండలం. అక్టోబర్ 23, శుక్రవారం: కంబదూరు, బొమ్మనహాల్ మండలాల్లో గతంలో టోకెన్లు పొందినప్పటికీ బాండ్ల పరిశీలన పూర్తికాని బాధితులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 24, శనివారం: అమరాపురం, కుందుర్పి, రామగిరి, లేపాక్షి, రొడ్డం, ఓడిసి మండలాల్లో మిగిలిపోయిన బాండ్ల పరిశీలన చేపడతారు. సమర్పించాల్సిన పత్రాలు ఇవే బాండ్ల పరిశీలనకు హాజరయ్యే బాధితులు కింది పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి. ఒరిజినల్ బాండ్ (ధ్రువీకరణ కోసం మాత్రమే చూపించాలి). సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్. బ్యాంకు పాస్బుక్ జిరాక్స్. ఫోటో, ఫోన్ నంబర్. అదనపు పత్రాలు: డిపాజిటర్ మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం, లీగల్ హైర్ లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేదా డిపాజిటర్ సమ్మతి లేఖను సంబంధిత పరిస్థితులకు అనుగుణంగా సమర్పించాలి. ఏజెంట్లు: ఏజెంట్ కోడ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్బుక్ వివరాలను తీసుకురావాలి. ఒరిజినల్ బాండ్లు ఇవ్వకూడదు బాండ్ల పరిశీలన సమయంలో ఒరిజినల్ బాండ్లను అధికారులకు అప్పగించకూడదని స్పష్టం చేశారు. ధ్రువీకరణ కోసం మాత్రమే చూపించాలని, బాండ్ కలర్ జిరాక్స్పై సంతకం చేసి సమర్పించాలని సూచించారు. పత్రాలు సమర్పించిన వారికి రశీదు అందజేస్తారు. సంప్రదించాల్సిన ఇన్స్పెక్టర్లు శ్రీధర్: 9441166600 లక్ష్మీనారాయణ: 9491667878 లలిత: 7702750778 ప్రకటించిన మండలాల బాధితులే రావాలి ప్రస్తుతం ప్రకటించిన మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీల్లోనే హాజరుకావాలని అధికారులు సూచించారు. మిగిలిన మండలాలకు సంబంధించిన తేదీలను తరువాత ప్రకటిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని అన్ని మండలాలకు చెందిన బాండ్ల పరిశీలన పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇంకా తేదీలు ప్రకటించని మండలాల బాధితులు అనవసరంగా దూరప్రాంతాల నుంచి అనంతపురానికి రావద్దని సూచించారు. తమ మండలానికి తేదీ ప్రకటించిన తరువాతే అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు.