రామలకోట రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు..
వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ మండల పరిధిలోని రామలకోట రహదారిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్స్) నిర్వహించారు. స్థానికంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్థానిక పోలీస్ సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా రామలకోట రోడ్డు మీదుగా ప్రయాణించే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర రవాణా వాహనాలను నిలిపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వాడకంతో పాటు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా అనే కోణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేస్తాం జరిమానాలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. రహదారి ప్రమాదాలను అరికట్టడానికి మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం