BREAKING
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు

పంటలు ఎండుతున్నా పట్టించుకునేదెవరు? మంత్రి జూపల్లిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు

Select Suryaa Now
పంటలు ఎండుతున్నా పట్టించుకునేదెవరు? మంత్రి జూపల్లిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు

పెద్దకొత్తపల్లి, సూర్య న్యూస్: సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు ఒక్కో రైతు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అప్పులు చేసి సొంత ఖర్చులతో పైప్‌లైన్లు వేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు నీరు వస్తున్నా జమ్ము, పూడిక పేరుకుపోవడంతో పొలాలకు నీరు సక్రమంగా చేరడం లేదని, చిన్నకొత్తపల్లి కొత్తచెరువు సైతం ఇప్పటివరకు నిండలేదని రైతులు వాపోతున్నారు.రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు, మండల బీజేపీ అధ్యక్షుడు దేశమోని పరుశరాముడు ఆధ్వర్యంలో కల్వకోల్, తీర్నాంపల్లి, మారేడుమాన్‌దిన్నె, చంద్రబండ తండా, యాపట్ల, చిన్నకార్పాముల గ్రామాల్లో ఎండిన పంట పొలాలు, సాగునీటి కాలువలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు.జొన్నలబోగుడ రిజర్వాయర్‌ నుంచి కల్వకోల్, తీర్నాంపల్లి గ్రామాల్లోని 2,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సిన ప్రధాన కాలువ పూడికతో నిండిపోయిందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లేని మాట్లాడుతూ కాలువల నిర్వహణపై మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. తక్షణమే పూడికతీత, మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరందించాలని, పైప్‌లైన్ల కోసం అప్పులు చేసిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేశమోని పరుశరాముడు, బీజేపీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.