BREAKING
-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక సూచనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి*

ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి
వికారాబాద్,(సూర్య): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో దరఖాస్తుదారుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికే ఓటరు జాబితాలో చోటు కల్పించాలని సూచించారు.
శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ వెంకటాచారి సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఫారం-6, ఫారం-7, ఫారం-8లకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌ విచారణలను సకాలంలో పూర్తి చేయడంతోపాటు, అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) తమ పరిధిలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయాలని, అవసరమైన పత్రాలను వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని తెలిపారు. ఓటర్ల అర్హతలను నిర్ధారించే సమయంలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు, అనర్హుల నమోదు, డూప్లికేట్‌ వివరాలు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని దరఖాస్తులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన రికార్డులను భౌతిక పత్రాల రూపంలో క్రమబద్ధంగా నిర్వహించి, భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచాలని సూచించారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని సీఈఓ పేర్కొన్నారు. దరఖాస్తుదారుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, నకిలీ, తప్పుడు, డూప్లికేట్‌ దరఖాస్తులను గుర్తించాలని, అర్హతలను నిర్ధారించిన అనంతరమే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నెమత్‌ హాలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.