-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక సూచనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు
పటాన్ చెరు;తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ శనివారం నార్సింగిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ను శాలువాతో సత్కరించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ భేటీలో రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు చేశారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని,పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది.గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ టీపీసీసీ అధ్యక్షుడికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.