కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు
పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్: మండల పరిధిలోని కల్వకోల్ గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమిశెట్టి ప్రేమ్‌కుమార్ గృహంలో అభిషేకం, అష్టోత్తర పూజ, సుహాసిని పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రాహ్మణ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు ఆకుతోట రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఎం. స్వామి, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు సోమిశెట్టి చంద్రశేఖర్, ఓరుగంటి శ్రీనివాసులు, అమ్రవాది కృష్ణయ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరిని కల్వకోల్, చెన్నప్పరావుపల్లి గ్రామాల ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.అమ్మవారి శాశ్వత పూజ కోసం శివకుమార్–మౌనిక దంపతులు వెండి వినాయక విగ్రహాన్ని, వాసవి మాతకు వెండి కిరీటాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు సోమిశెట్టి ప్రేమ్‌కుమార్, కార్యదర్శి ప్రదీప్‌కుమార్, సందీప్‌కుమార్, వాసవి సిండికేట్ అధ్యక్షుడు కలకొండ రాంబాబు, ఆర్యవైశ్య ప్రముఖులు, వనిత క్లబ్ అధ్యక్షురాలు సోమిశెట్టి శ్రీలత, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.