ఆత్మకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా రెండేళ్లలోనే అనేక అభివృద్ధి మౌలిక వసతులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపాలిటీని రానున్న రెండున్నర సంవత్సరాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఇప్పటికే రెండున్నరసంవత్సరాల్లో వందలాది కోట్ల రూపాయల నిధులు సాధించి అనేక అభివృద్ధి పనులు, మౌళిక వసతులు కల్పించామని, ప్రతిపక్షం ఏమి అభివృద్ధి సాధించారో చెప్పగలరా, తాము సాధించిన అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తాం, అభివృద్ధిని అడ్డుకునే వారిని నిలువరించండి, కూటమికి మున్సిపాలిటీలో పట్టం కడితే మరింత అభివృద్ధి సాధ్యం అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరులోని రవితేజ కళ్యాణమండపం వద్ద కూటమి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తాము రెండున్నర సంవత్సరాలలో సాధించిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసనని, ప్రజల విశ్వాసం తమకు మెండుగా ఉందని, ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే ప్రతిపక్ష నేతల్ని గత ఐదేళ్లలో ఏం చేశారు అంటూ నిలదీయాలని సూచించారు. ఎన్ డి ఏ కూటమి లోని తెలుగుదేశం, బిజెపి, జనసేన పొత్తుతో సమన్వయంతో రాష్ట్ర జిల్లా మున్సిపల్ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా ఎస్టీలకు మూడు,ఎస్సీలకు నాలుగు, బీసీలకు ఏడు,జనరల్ ఆరు, జనరల్ మహిళలకు 8 సీట్లు రిజర్వ్ అయ్యాయని, అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించామని, గత రెండున్నర సంవత్సరాలలో సుపరిపాలన అందించిన కూటమి తరపున అభ్యర్థులకు ప్రజలంతా మద్దతు ఇచ్చి ఆశీర్వదించి విజయం చేకూర్చాలని, అన్ని వార్డుల్లో విజయం సాధించేలా తమ వంతుగా ప్రచారం సాగిస్తామని ఆనం పేర్కొన్నారు. ఇటీవలనే అంబేద్కర్ భవన్, షాది మంజుల్ కు శంకుస్థాపన గావించామని, త్వరలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ కు కూడా నిధులుసాధించనున్నామని, అనాదిగా పెండింగ్ లో ఉన్న ఆక్రమిత ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించనున్నామని, ఇళ్ళు నిర్మించుకున్న వారికి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆనం పేర్కొన్నారు. గతంలో సోమశిల ప్రాజెక్టు వద్ద నుండి ఆత్మకూరుకు త్రాగునీటిని సరఫరా చేయిస్తుండగా పెరిగిన జనాభాతో ఆ నీరు చాలానందున అమృత పధకం రా నిధులు సాధించామని, త్వరలో టెండర్ పూర్తవుతుందని, మున్సిపల్ పరిధిలో సిసి రోడ్లు తారు రోడ్లు ఇంకా 32 కోట్లు కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 29 కోట్లు మంజూరు చేశారని, సైడ్ డ్రైన్స్ కు 12 కోట్లు మంజూరు చేశారని, నెల్లూరు పాలెం నుండి ఆత్మకూరుకు, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి పట్టణంలోకి నాలుగు లైన్ల రోడ్లు,డివైడర్లు,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, వంద పడకల హాస్పిటల్ త్వరలో 150 పడకలుగా తీర్చిదిద్దనున్నామని, గతంలో పాలిటెక్నిక్ కళాశాల, గురుకుల పాఠశాలలు, ఐటిఐ లను సాధించామని, బీసీ గురుకుల పాఠశాలను సాధించి జూనియర్ కాలేజీ గా అప్గ్రేడ్ చేయించామని, ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యంగా విధులు సాధిస్తున్నామని, నరసాపురం నుంచి నాగులపాడు వరకు 24 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించేందుకు రంగం సిద్ధం అయిందని, నిధుల మంజూరుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఆనం పేర్కొన్నారు. గతంలో రైతులకు సాగునీటి ఇబ్బంది ఉన్నందున ప్రత్యేకంగా పంపింగ్ స్కీమ్ ఏర్పాటు చేయడంతో రెండో పంట కూడా పండించుకునే అవకాశం లభించిందని, ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అన్ని వర్గాల అభివృద్ధి,అన్ని వర్గాలకు మౌళిక వసతులు కల్పించడం,ఆత్మకూరు మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నానని, ప్రజలు గమనించాలని, అభివృద్ధిని మౌళిక వసతులను ఆశించి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చాలని ఆయన కోరారు.రెండున్నర సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, పెన్షన్ 4,6,10,15 వేలుగా పెంచి ఇస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, తల్లికి వందనం ద్వారా ఎందరు విద్యార్థులు ఉన్న నిధులు విడుదల చేస్తున్నామని, 3ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని,అన్నదాత సుఖీభవ ద్వారా ఏడాదికి 20 వేల రూపాయలు రైతులు అందజేస్తున్నామని, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నామని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసామని రామనారాయణ రెడ్డి పేర్కొంటూ మంచి పరిపాలన అందించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరు ఆశీర్వదించాలని ఆత్మకూరు పురపాలక సంఘంలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే మరింత ప్రజలకు మెరుగైన సేవలు మౌలిక వసతులు అభివృద్ధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం ఎం ఎస్ ఎం ఈ పార్కును ప్రారంభించగా 32 పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష తప్పుడు వాగ్దానాలకు ఆకర్షితులైతే అభివృద్ధి కుంటు పడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలో మట్టి రోడ్డు లేకుండా ప్రతి వీధిని సిమెంట్ రోడ్డు తో ఉంచుతామని రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరు అనే విషయమై అధిష్టానం పరిశీలిస్తుందని, సాయంత్రానికి ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎవరూ టికెట్లు దక్కలేదని నిరుత్సాహం చెందకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తే భవిష్యత్తులో వారికి అవకాశాలు లభించే పరిస్థితి తప్పకుండా ఉంటుందని రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు కర్ణాటి ఆంజనేయ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి, జనసేన జిల్లా సీనియర్ నాయకుడు నలిశెట్టి శ్రీధర్, జిల్లా తెలుగుదేశం కోశాధికారి కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యా రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్ర రెడ్డి, ఆత్మకూరు మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, తెలుగుదేశం నాయకులు దావా పెంచలరావు, పులిమి శైలజా రెడ్డి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, వైస్ చైర్మన్ గొట్టి గుండాల బుజ్జి రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, ఆత్మకూరు మాజీ మండలాధ్యక్షుడు కేత వేణుగోపాల్ రెడ్డి,పలువురు పట్టణ,మండల తెలుగుదేశం నాయకులు, మున్సిపల్ వార్డులకు పోటీ చేయనున్న కూటమి అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.