BREAKING
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు

శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

సూర్య నస్పూర్‌ :శ్రీరాంపూర్‌ ఏరియా గనులు, కార్యాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఎస్ఆర్పీ ఓసీపీ, ఎస్ఆర్పీ 3&3ఏ గనుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాంపూర్‌ ఓసీపీలో పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, ఆటపాటలతో ఊరేగింపుగా చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్‌ తొలుత క్వారీలో ఉత్పత్తిని పరిశీలించి, లక్ష్యాలకు అనుగుణంగా రోజువారీ ఉత్పత్తి సాధించాలని సూచించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని వేడుకల్లో పాల్గొన్నారు. బోనాల సమర్పణ అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఎస్ఆర్పీ 3&3ఏ గనిలో చండీ శాంతి హోమం, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్‌ అమ్మవారిని దర్శించుకుని, ఆమె ఆశీస్సులతో శ్రీరాంపూర్‌ ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు అన్ని రంగాల్లో సింగరేణిలో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.