BREAKING
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు

యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన

Select Suryaa Now
యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన
సూర్య వాంకిడి:  యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం వాంకిడి మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. బీజేవైఎం కొమురం భీం జిల్లా అధ్యక్షుడు ఎలగతి సుచిత్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూత్‌ డిక్లరేషన్‌ను అమలు చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని కోరారు. రాజీవ్‌ వికాస్‌ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని అన్నారు.నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా యువతకు న్యాయం చేయాలని కోరారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రామగిరి విశాల్‌, శ్రీకాంత్‌, మండల ఉపాధ్యక్షుడు ఏకబిల్వం నరేందర్‌, బీజేవైఎం ఐటీ సెల్‌ కన్వీనర్‌ దుర్గం అక్షయ్‌కుమార్‌, బీజేవైఎం నాయకులు రేఖల గణేష్‌, చౌదరి కార్తీక్‌, పెందర్‌ సాయికిరణ్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.