ఇల్లందులపాడులో 18న బతుకమ్మ పోటీలు
సూర్య ఇల్లందు,ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని, రెండో వార్డు ఇల్లందులపాడు కాళీమాత ఆలయం ఎదుట, ఈ నెల 18న బతుకమ్మ పోటీలు నిర్వహించనున్నారు.
స్థానిక యువత, పెద్దల ఆధ్వర్యంలో, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారం, మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
బతుకమ్మ
పోటీల్లో విజేతలుగా నిలిచే మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నారు. మొదటి బహుమతి: డ్రెస్సింగ్ టేబుల్,
రెండో బహుమతి మిక్సర్ గ్రైండర్,
మూడో బహుమతి పట్టు చీర,ఈ బహుమతులను స్థానికులు అందే భరత్ అందించే ఆర్థిక సహాయంతో, కొనుగోలు చేసి, ఆయన చేతుల మీదుగా విజేతలకు అందజేయనున్నారు.
1వ, 2వ వార్డుల మహిళలకు మాత్రమే అవకాశమని, వారు మాత్రమే
ఈ నెల 18న నిర్వహించే బతుకమ్మ పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. అయితే
విజేతల ఎంపికను ప్రత్యేక కమిటీ ద్వారా నిర్వహించనున్నారు.
మహిళలు పెద్ద సంఖ్యలో, ఉత్సాహంగా పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు.
మహిళల ఐక్యతను చాటుతూ, ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు