అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణం - ఎమ్మెల్యే బుడ్డా
అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణం - ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
* అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఇండోనేషియా లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ లెవెల్ -1 శిక్షణా తరగతులకు హాజరై ధృవీకరణ పత్రం పొందడం గర్వకారణమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో జునైద్ భాష ను అభినందించారు.*తన నియోజకవర్గ క్రీడాకారుల ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేస్తానని ప్రతిఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రేడియం నూర్,స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా,ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ సెక్రెటరీ నిమ్మి కృష్ణ యాదవ్, ఆసర్.నూర్ బేగ్, ఖోఖో కోచ్ మహేబూబ్,తైక్వాండో కోచ్ ఖాజా హుస్సేన్,ప్రభాకర్ పాల్గొన్నారు*