BREAKING
-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక సూచనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి*

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఏవీ? కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది: బీసీ కులాల జేఏసీ నేతలు

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఏవీ?  కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది: బీసీ కులాల జేఏసీ నేతలు

భీమవరం, సూర్య న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీసీ కులాల జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ అంశంపై భీమవరంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.బీసీ సంఘాల న్యాయ సలహాదారు, న్యాయవాది మల్లవరపు శివరామ్ మాట్లాడుతూ, 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి డెడికేషన్ కమిషన్ నివేదికను కోర్టుల్లో ప్రభుత్వం సమర్థవంతంగా నిరూపించలేకపోవడంతో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం మండల, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ, ఆ మేరకు సీట్ల కేటాయింపు జరగలేదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, పార్టీ పరంగా 40 శాతం సీట్లు ఇస్తామన్న హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.బీసీ కులాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి గురుప్రసాద్ మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపాలిటీలు గత 25 ఏళ్లుగా వరుసగా జనరల్ కేటగిరీలోనే కొనసాగడం బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా చేసే కుట్రగా కనిపిస్తోందని విమర్శించారు. జిల్లాలో బీసీలు గణనీయమైన జనాభా కలిగి ఉన్నప్పటికీ, పాలకొల్లు మున్సిపాలిటీకి మాత్రమే బీసీ రిజర్వేషన్ కల్పించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీలకు కేటాయించిన స్థానాల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను వెన్నెముకగా అభివర్ణించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ నాయకుడు పితాని భాస్కరరావు పాల్గొన్నారు.

రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా,