సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య
నరసరావుపేట: మున్సిపల్ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తరఫున 35వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాసా రాంబాబు, 2వ వార్డు అభ్యర్థిగా షేక్ చిన్న జాన్ షైదా పోటీ చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ వై. చెంచయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు. నరసరావుపేట పట్టణంలో లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్‌తో పాటు పలు కాలనీల నిర్మాణం, అభివృద్ధి, పేదలకు ఇళ్ల స్థలాల సాధనలో సీపీఐ కీలక పాత్ర పోషించింద ని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో సీపీఐ చేసిన కృషిని గుర్తించి 35వ వార్డు అభ్యర్థి కాసా రాంబాబు, 2వ వార్డు అభ్యర్థి షేక్ చిన్న జాన్ షైదాలను గెలిపించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, నియోజ కవర్గ కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మహంకాళి సుబ్బారావు, జిల్లా నాయకులు రోడ్డ అంజిరెడ్డి, కొయ్య శ్రీను, దుగ్గి బ్రహ్మయ్య, నాగేశ్వరరావు, రాజు, సూర్య, హేమంత్, షేక్ మహబూబ్ సుభాని, షేక్ కైరున్నీసా తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..