జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు
నరసరావుపేట : అండర్-19 ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి గురుకుల పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో 13 జిల్లాల నుంచి 1,250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాగ్దేవి కళాశాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించగా ముగ్గురు విద్యార్థులు ఆరు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కుంచాల చంద్రశేఖర్ ట్రిపుల్ జంప్‌లో ప్రథమ స్థానం 400 మీటర్ల హర్డిల్స్‌లో తృతీయ స్థానం, 4×400 మీటర్ల రిలేలో ద్వితీయ స్థానం సాధించాడు. గుమ్మా వెంకట నాగరాజు షాట్‌పుట్‌లో ద్వితీయ, హామర్ త్రోలో తృతీయ స్థానం పొందాడు. భూక్యా నరసింహ నాయక్ 4×400 మీటర్ల రిలేలో ద్వితీయ స్థానం సాధించాడు. వీరంతా డిసెంబరులో హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. కళాశాల డైరెక్టర్లు కాట్ల రామకోటేశ్వరరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, పాశం కృష్ణారావు, పి.వి. అచ్యుతరావు, ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…