BREAKING
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు నామినేషన్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి (ఏఆర్) శేషాద్రి నిజవల్లి సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కరీ బసమ్మ నామినేషన్ దాఖలు తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమరావతిలో 200 ఎకరాల్లో AVGC పార్క్.. 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్  నిజవల్లి వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థిగా జుమాను కావ్య నామినేషన్. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలను కాపాడాలని భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు! అక్కంపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతు దారుడు మాధవరెడ్డి నామినేషన్ సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందడి పాల్గొన్న ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ ఐవీఎఫ్ (IVF) అక్రమాల కేసులో కీలక పరిణామం.. చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపు పాత్రికేయులకు ఘన సత్కారం....బ్రిలియంట్ పాఠశాలలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలి..

అమరావతిలో 200 ఎకరాల్లో AVGC పార్క్.. 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్ 

Select Suryaa Now
అమరావతిలో 200 ఎకరాల్లో AVGC పార్క్.. 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్ 
అమరావతి: రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏకంగా మూడు నూతన టెక్నాలజీ పాలసీలకు సంబంధించి ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (AVGC-XR), రొబోటిక్స్, సెమీకండక్టర్ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా ఈ నూతన విధానాలను రూపొందించారు.

ఈ నూతన విధానాలలో భాగంగా రాజధాని అమరావతి వేదికగా 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యధునాతన AVGC పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, యానిమేషన్, గేమింగ్ రంగాలలో సృజనాత్మకత కలిగిన యువతకు స్థానికంగానే మెరుగైన వేదిక లభించనుంది. అలాగే, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో రొబోటిక్స్ తయారీ, పరిశోధన మరియు అభివృద్ధి (R&D) రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు, దేశీయంగా ,అంతర్జాతీయంగా అత్యంత డిమాండ్ ఉన్న సెమీకండక్టర్ల తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు కోసం ఏకంగా 5 వేల ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఈ విధానాలకు ఆమోదం తెలపగా, తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడటంతో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి నూతన మార్గం సుగమమైంది.